![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1026 లో.. మను దగ్గరికి తన గ్రాండ్ మా వచ్చి భోజనం చెయ్ అని చెప్తుంది. నాకు వద్దని మను అంటాడు. బయట ఎక్కడ అయిన తిన్నావా అని అడుగగా.. ఆకలిగా లేదని మను అంటాడు. ఎదుటి వాళ్ళ సంతోషంతో కడుపు నింపుకున్నావని అర్థం అవుతుందని ఆ పెద్దావిడ అంటుంది. ఆ తర్వాత బర్త్ డే సెలెబ్రేషన్స్ కి ఎవరెవరు వచ్చారని అడుగుతుంది. అందరూ వచ్చారని మను అంటాడు.
ఆ తర్వాత అనుపమ వచ్చిందా అని మనుని అడుగుతుంది. ఎందుకు రాదు తను కూడా కాలేజీ స్టాఫ్ కదా అని మను అంటాడు. మరొకవైపు అనుపమ మాటలని వసుధార గుర్తుకు చేసుకుంటుంది. అప్పుడే వసుధార దగ్గరికి మహేంద్ర వస్తాడు. మీకు అనుపమ మేడమ్ గురించి మొత్తం తెలుసా అని మహేంద్రని వసుధార అడుగుతుంది. నేను, జగతి, అనుపమ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ మాకు ఎవరికి కొన్ని రోజులు అనుపమ టచ్ లో లేదు. మళ్ళీ అరకులో కలిసింది. ఇక ఆ తర్వాత నీకు తెలుసు కదా.. కానీ ఈ మధ్య నాకు తెలియని విషయాలు కూడా ఉన్నాయని అర్ధం అవుతుందని మహేంద్ర అంటాడు. మను గారు వచ్చినప్పటి నుండి తనలో ఏదో చేంజ్ వచ్చింది. మీరు అడుగొచ్చు కదా అని వసుధార అంటుంది. అడుగుతాను కానీ టైమ్ వచ్చినప్పుడు అని మహేంద్ర అంటాడు.
ఆ తర్వాత ఏంజిల్ అనుపమ కోసం వెయిట్ చేస్తుంటుంది. అప్పుడే అక్కడకి మను వస్తాడు. ఎవరికోసం వెయిట్ చేస్తున్నారని మను అడుగుతాడు. మీ కొసమే మీ బర్త్ డే కనుక్కుందామని ఏంజిల్ అంటుంది. చెప్పాను కదా తెలియదని మను అంటాడు. అప్పుడే అనుపమ ఫోన్ చేస్తుంది. మనుతో మాట్లాడుతున్న అనగానే.. సరే నేను ఇప్పుడు రావడం లేదు సాయంత్రం కలుద్దామని అనుపమ అంటుంది. నేను ఉన్నానని చెప్తే అలానే అంటుందని మను అంటాడు. మీకు అబద్ధం చెప్పాను.. మీ కోసం కాదు నేను వెయిట్ చేసేది మా అత్తయ్య కోసమని ఏంజిల్ చెప్తుంది. ఆ తర్వాత శైలంద్ర అన్ని ప్లాన్స్ ఫెయిల్ అయితున్నాయని తనని తాను అద్దంలో చూసుకుంటూ తిట్టుకుంటు ఉంటాడు. అప్పుడే దేవయాని వచ్చి ఒక్కోసారి మనం అనుకోనప్పుడు కూడా మనం అనుకున్నది జరుగుతుందని శైలేంద్రతో దేవయాని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |